మునక్కాయ టమాటో కూర తయారు చేసే విధానం

రుచులు

మునక్కాయ టమాటో కూర తయారీకి కావలసిన పధార్థాలు:

  1. మునక్కాయలు : 2 కప్పులు
  2. టమాటో : 2 కప్పులు
  3. తరిగిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  4. పసుపు: 1/2 స్పూన్
  5. ఉప్పు: తగినంత
  6. కారం : తగినంత
  7. కరివేయపకు , కొత్తిమిర
  8. ఆవాలు , జీలకర్ర : 1స్పూన్
  9. అల్లం వెల్లులి పేస్టు : 2 స్పూన్స్
  10. ధనియాల పొడి : 1 స్పూన్
  11. గరం మసాలా : 1/2 స్పూన్
  12. నూనె : 4 స్పూన్స్
  13. నీళ్ళు

తయారు చేయు విధానం :

  • స్టవ్ ఫై గిన్నె పెట్టి కూరకి తగినంత నూనె పోసాక దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేయపకు వేసాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసి అవి వేగాక అల్లం వెల్లులి పేస్టు వేసి కాస్త పసుపు వేయాలి.
  • ముందుగా మునక్కయలను కట్ చేసుకొని నార తీసి కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • ఈ మునక్కయలను కూరలో వేసి బాగా కలిపి కాసేపు నూనెలొ మగ్గనివ్వాలి.
  • ఇపుడు సన్నగా తరిగిన టమాటో లను కూరలో వేసి కలిపి ఉడకనివ్వాలి.
  • కూరకి  తగినంత ఉప్పు, కారం వేసి మునక్కడలు మగ్గడానికి కావలసిన నీళ్ళను పోసి కూరని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
  • చివరగా కూరలో దనియ పొడి, గరం మసాలా, కొత్తిమిర వేసి కలిపి రుచి సరిగా ఉందా చూసుకోవాలి.

 

Leave a Reply