Pawan Kalyan

ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌ల్లో విషాదం.. ముగ్గురు అభిమానులు మృతి :

ఆంధ్రప్రదేశ్, టాలీవుడ్

చిత్తూరు, సెప్టెంబర్ 2:  జనసేన అధినేత, సినీ నటుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన రోజుని పుర‌స్క‌రించుకొని చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో25 అడుగుల ఎత్తున బ్యానర్ క‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు ప‌వ‌న్ అభిమానులు. అయితే బ్యాన‌ర్ క‌ట్టే సమయంలో విద్యుత్ వైర్లు తగ‌ల‌డంతో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. మొత్తం 10 మంది విద్యుదాఘాతానికి గురి కాగా, ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మృతులను సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

ఈ ఘటన పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ క‌రెంట్ షాక్‌తో మృతి చెందిన త‌న అభిమానుల వార్త త‌న‌ని దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. విద్యుత్ ప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశించారు. జన సైనికుల మరణం మాటలకు అందని విషాదం. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను. క్షతగాత్రులు ముగ్గురూ కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను.దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక ఆ తల్లితండ్రులకు నేనే ఒక బిడ్డగా నిలుస్తాను. ఆర్థికంగా ఆ కుటుంబాలను ఆదుకొంటాను అంటూ పవ‌న్ క‌ళ్యాణ్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Leave a Reply