వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం జగన్

అమరావతి, సెప్టెంబర్ 11: ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లో మరో పథకానికి శ్రీకారం చుట్టారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ‘వైఎస్సార్‌ ఆసరా’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ… వైఎస్సార్ పథకం ద్వారా ఏపీలో 87.75 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు జమ అవుతుందని చెప్పారు. 2019 ఏప్రిల్‌ 11 నాటి వరకు ఉన్న అప్పును, రుణాలను నాలుగు విడతలుగా అందజేస్తామని సీఎం జగన్ తెలిపారు. త్వరలోనే వైఎస్సార్‌ ఆసరా వారోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు.

తొలి విడతలో రూ.6,792.20 కోట్లను ఆయా కార్పొరేషన్ల ద్వారా ఈరోజు జమ చేశారు. బ్యాంకర్లు ఆ మొత్తాన్ని పాత అప్పులకు మినహాయించుకోకూడదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

admin: