Corona Vaccine

పూర్తిస్థాయి అధ్యయనం కాని వ్యాక్సిన్ తో దుష్ప్రభావాలే ఎక్కువ: డబ్ల్యూహెచ్ఓ

అంతర్జాతీయం

జెనీవా, సెప్టెంబర్ 1:  కరోనాను మహమ్మారిని నివారించేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ల అభివృద్ధిపై ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కోవిడ్19 వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకొన్నాయని ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు ప్రకటనలు కూడా చేసాయి. పైగా కరోనాను నివారించేందుకు వ్యాక్సిన్ ఈ ఏడాది చివరికల్లా వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడ ఇటీవలనే కీలక ప్రకటన చేశారు. దీంతో రష్యా ఒకడుగు ముడుకేస్తూ ‘స్పుత్నిక్‌-వి’ పేరుతో వ్యాక్సిన్ సిద్ధమైందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ప్రయోగాల్లో భాగంగా ఈ వ్యాక్సిన్‌ను తన ఇద్దరు కుమార్తెల్లో ఒకరికి ఇవ్వగా.. ఆమె శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తిఅయినట్టు వెల్లడించారు. ఈ వార్తతో ఓ వైపు ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవగా మరోవైపు ఈ రష్యా వ్యాక్సిన్‌ సామర్థ్యంపై ప్రపంచవ్యాప్తంగా పలువురు శాస్త్రజ్ఞులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కరోనాను నివారిస్తోందని రుజువు చేయని వ్యాక్సిన్ వాడితే దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని డబ్ల్యుహెచ్ఓ అభిప్రాయపడింది. హడావుడిగా వ్యాక్సిన్ ప్రయోగాలకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని, భవిష్యత్తులో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే అవకాశం ఇక ఉండదని, పూర్తిస్థాయి అధ్యయనానికి నోచుకోని వ్యాక్సిన్ పనితీరు కూడా అరకొరగానే ఉండొచ్చని డబ్ల్యు హెచ్ ఓ సైంటిస్టులు స్పష్టం చేశారు. అమెరికాలో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి త్వరలోనే అనుమతి మంజూరు చేస్తామని అమెరికా ఎఫ్ డీఏ పేర్కొన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ విధంగా స్పందించింది.

 

 

Leave a Reply