Medak Additional Collector Nagesh

ఏసీబీ వలకు అడ్డంగా దొరికిన మెదక్ అడిషనల్ కలెక్టర్

తెలంగాణ

మెదక్, సెప్టెంబర్ 9:  తెలంగాణాలో అవినీతి నిరోధకశాఖ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తిలోని 112 ఎకరాలకు NOC ఇచ్చేందుకు అడిషనల్ కలెక్టర్ నగేశ్ భారీగా లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. ఎకరానికి లక్ష రూపాయల చొప్పున కోటి 12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని, కొంత మొత్తం చెల్లించిన 15 రోజులకు కూడా పని జరగకపోవడంతో మూర్తి అనే రైతు.. ఏసీబీని ఆశ్రయించాడని తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్నని నగేశ్ 40లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. మెదక్ మాచవరంలో లక్ష రూపాయల నగదుతో పాటు హైదరాబాద్ బోయినపల్లిలో లాకర్ ను అధికారులు గుర్తించారు.

ఇప్పటికే కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. నగేశ్ కేసులో 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. నర్సాపూర్ తహసీల్దార్ కార్యాలయంలోనూ ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆర్ డి ఓ అరుణారెడ్డి, తహసీల్దార్ మాలతి, ఏంఆర్ఓ , వీఆర్ఓ, వీఆర్ఏ, జూనియర్ అసిస్టెంట్ల ఇళ్లు, కార్యాలయాలపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో జరిగిన సోదాల్లో ఇప్పటికే 26 లక్షల నగదు, అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. చౌదరిగుడాలోని ఆమె నివాసంతో పాటు.. ఆమె బంధువుల ఇళ్లలోనూ ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి.

 

 

Leave a Reply