జనసేన ప్రతినిధులుగా శరత్ కుమార్, వివేక్ బాబు నియామకం

Advertisement

హైదరాబాద్, సెప్టెంబర్ 6:  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పటిష్టత కోసం కీలక నియామకాలు చేపట్టారు. మీడియా చర్చా కార్యక్రమాల్లో తమ గళాన్ని బలంగా వినిపించేందుకు సేనాని కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ తరఫున మీడియా చానళ్ల చర్చా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతినిధులుగా కోటమరాజు శరత్ కుమార్, పి.వివేక్ బాబులను ఆదివారం పార్టీ ప్రకటించింది. ఈ సందర్జభంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయ కార్యదర్శి అయిన పి.హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.

విజయవాడకు చెందిన శరత్ కుమార్ (42) ఎంటెక్, ఎల్ఎల్‌బీ, పీహెచ్‌డీ పట్టభద్రులు, ప్రస్తుతం ఆయన లెక్చరర్ గా పనిచేస్తున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన వివేక్ బాబు (40) బీటెక్ గ్రాడ్యుయేట్. ఆయన గతంలో ఓ న్యూస్ చానల్ కు రిపోర్టర్ గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉంటున్నారు. పార్టీ ప్రతినిధులుగా నియమితులైన వీరిద్దరికీ జనసేనని పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు.

 

Advertisement

 

admin:
Advertisement
Advertisement