మందుబాబులకు గుడ్ న్యూస్: ఏపీలో తగ్గిన మద్యం ధరలు

Advertisement

అమరావతి సెప్టెంబర్ 3 :  ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను తగ్గించాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మందు బాబులతో మద్యం అలవాటును మాన్పించాలని ప్రభుత్వం మద్యం ధరలను దాదాపు రెట్టింపు చేసిన విషయం తెలిసిందే. కాని ఇదే సమయంలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు కావడంతో చుక్క దొరక్క మందు బాబులు పిచ్చెక్కిపోయారు. ఆఖరుకు సానిటైజర్ లో కూడా ఆల్కహాల్ శాతం ఉంటుందనె వెర్రితనంతో… అవి తాగి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా అధికమయ్యారు.

దీంతో ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించింది. ప్రసూ దేశీయంగా తయారైన విదేశీ మద్యం ధరలు ప్రభుత్వం సవరించింది. 180 ఎంఎల్‌ బాటిల్ ధర రూ.30 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం తగ్గించింది. అయితే ఇవి రూ.120కి మించని బ్రాండ్లకు‌ మాత్రమే వర్తించనుంది.

క్వార్టర్‌ ధర రూ.30 నుంచి 280 వరకు తగ్గించారు. ఇది కూడా రూ.120 నుంచి రూ.150 వరకూ ఉన్న బ్రాండ్లకు మాత్రమే… క్వార్టర్ రూ.150 నుంచి 190 మధ్య ఉన్న బ్రాండ్ల ధరలు యధాతథం చేశారు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement

ఇక బీర్లు ధర రూ.30 తగ్గించారు. నేటి నుండి సవరించిన ధరలు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తీసుకు వచ్చే వ్యక్తులకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. జీవో నెం. 411 ప్రకారం మద్యాన్ని తీసుకుని వచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ఉన్నతన్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి మూడు మద్యం బాటిళ్లు తెచ్చుకునే అవకాశాన్ని ఇచ్చింది.

 

Advertisement
admin:
Advertisement
Advertisement