అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు

తెలంగాణ

జనగామ, జూన్ 23: అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం International Day Against Drug Abuse and Illicit Trafficking సందర్భంగా ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ – District De-Addiction Centre (DDAC) ఆధ్వర్యంలో జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి మన్నెమ్మ గారు మాట్లాడుతూ, యువత గంజాయి, మద్యం, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చెడు అలవాట్లకు లోను కాకుండా విద్య మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలని కోరారు.

ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ, మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. యువత శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీమతి ఊర్మిళ గారు, యాకుబ్ పాషా గారు, తిరుపతి గారు, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.