తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా శ్రీమతి శాంతి కుమారి
హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (సీఎస్)గా 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శ్రీమతి ఎ. శాంతి కుమారిని నియమించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి మహిళా ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి శాంతి కుమారి బాధ్యతలు చేపట్టారు.
తనకు సీఎస్ గా అవకాశం కల్పించినందుకు ప్రగతి భవన్ లో సీఎం శ్రీ కేసీఆర్ ను కలిసి శ్రీమతి శాంతి కుమారి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం శ్రీమతి శాంతి కుమారికి శుభాకాంక్షలు తెలిపారు.