దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ

క్రీడలు, తెలంగాణ

దేవరకొండ, సెప్టెంబర్ 28: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ ఉదయం 8:30 నిమిషాలకు స్థానిక దేవరకొండ బస్టాండ్ నుండి ర్యాలీనీ MLA రమావత్ రవీంద్ర కుమార్ గారు, మరియు దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT, మరియు సభ్యులు ప్రజా ప్రతినిధులతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక దినోత్సవ ర్యాలీ నిర్వహించడం మన దగ్గర ఉన్న ఎన్నో పర్యాటక స్థలాలను గుర్తు చేసుకోవడం లాంటిదని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సేవలు అలాగే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను కూడా విజయవంతం చేస్తున్న దేవరకొండ స్పోర్ట్స్ చేసిన వారిని అభినందించారు తర్వాత ఖిల్లా గుట్ట వరకు ర్యాలీ నిర్వహించడం జరిగినది.

కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, మాజీ చైర్మన్ దేవేందర్ నాయక్, కమిషనర్ వెంకటయ్య గారు పాల్గొన్నారు, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు NVT మాట్లాడుతూ , దేవరకొండ నియోజకవర్గం లో ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయని కిల్ల గుట్ట, భీమనపల్లి చెరువు, దేవరచర్ల గుడి, వైజాగ్ కాలనీ, గాజువాక , అక్కంపల్లి రిజర్వాయర్, బాపనుకుంటా, డిండి రిజర్వాయర్, లాంటి ఎన్నో పర్యాటక స్థలాలు ఉన్నాయి కాబట్టి వీటిని అభివృద్ధి చేయాలని, దానివలన ఎంతో ఆర్థికంగా నియోజకవర్గ ముందుకెళుతుందని కాబట్టి ప్రభుత్వం తప్పనిసరి దేవరకొండ నియోజకవర్గం లో ఉన్న వాటిని పర్యాటక స్థలాలుగా గుర్తించాలని ఈ సందర్భంగా వారు కోరారు.

ఈ కార్యక్రమంలో తీరం దాస్ కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి తాళ్ల శ్రీధర్ గౌడ్, కోశాధికారి కృష్ణ కిషోర్, అమర్, ముత్యాల సర్వయ్య, పంతులాల్, రాజకుమార్ రెడ్డి, యునెస్ పర్వాన్, సత్యనారాయణ రెడ్డి, కుమార్, రామకృష్ణ, తాళ్ల సురేష్, నల్ల నరసింహ, వేముల రాజు, కౌన్సిలర్ పొన్నబోయిన సైదులు, వనం చంద్రమౌళి, గాజుల రాజేష్, డాన్స్ మాస్టర్ క్రాంతి, కరాట మాస్టర్ శ్రీను, కిషన్ లాల్, కౌన్సిలర్ ప్రదీప్, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ భాస్కర్, సలీం, జయరాం, నరేష్, సందీప్, డాన్స్ మాస్టర్ జగన్, వెంకట్, సాయి, కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు మరియు సిబ్బంది, రవీంద్ర భారతి స్కూల్ విద్యార్థులు మరియు సిబ్బంది, దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ తైక్వాండో విద్యార్థులు, సభ్యులు, మరియు కళాకారులు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.