న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు

తెలంగాణ

న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో 75వ స్వాతంత్య్ర వేడుకలు

హైదరాబాద్, 15 ఆగష్టు:  75 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా న్యూ హోప్ అసోసియేషన్ సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా Ex CWC Chair Person శ్యామలా దేవి గారు విచ్చేశారు. తొలుత జండా ను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కోమలి కృష్ణారెడ్డి మరియు సంస్థ సిబ్బంది Mr బాబు జోసెఫ్, P. సిద్దేశ్వర్, M. ప్రశాంత్ రెడ్డి,A శ్రవణ్, M. విజయ లక్ష్మి, రాకేష్ మరియు ODIC కో ఆర్డినేటర్ P. సంతోషి, సుజాత , శ్రీ లేఖ, కాంతమ్మ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు .

ఈ కార్యక్రమం లో భాగంగా శ్యామలా దేవి గారు ఆల్కహాలిక్ లు మరియు ఎడిక్ట్ లను ఉద్దేశించి మత్తు నుంచి దూరంగా ఉండాలని దురలవాట్లు నుంచి స్వాతంత్రం లభించాలని ప్రసంగం ఇచ్చారు. సంస్థ ప్రధాన కార్యదర్శి అయిన D. కోమలి కృష్ణారెడ్డి గారు ఆల్కహాలిక్ ల చేత e-Pledge చేయించారు. తదనంతరం జాతీయ గీతం ఆలపించి స్వీట్స్ అందించి కార్యక్రమాన్ని ముగించారు.

Leave a Reply