కల్లు కోడి కూర

కల్లు కోడి కూర ఎలా తయారీ చేయాలి

రుచులు

కల్లు కోడి కూర తయారికి కావల్సిన పధార్థాలు :

  1. చికెన్
  2. తాటి కల్లు
  3. ఉల్లిగడ్డలు -2
  4. పుదినా, కోతిమీర
  5. అల్లం, వెల్లుల్లి పేస్టు
  6. కారం
  7. ఉప్పు
  8. పసుపు
  9. నూనె
  10. ధనియాల పొడి
  11. గరం మసాలా దినుసులు

కల్లు కోడి కూర తయారీ విధానం :

  • శుబ్రంగా కడిగిన చికెన్ తీసుకోని దానిలో పసుపు,కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
  • స్టవ్ మీద గిన్నె పెట్టి కూరకి తగినంత నూనె పోసి వేడి అయ్యాక పుదినా, గరం మసాలా దినుసులు, ఉల్లి ముక్కలు వేసి వేగాక  కాస్త పసుపు వేసి  ఆ తరువాత చికెన్ వేసి  వేగనివ్వాలి.
  • చికెన్ వేగాక ధనియాల పొడి, కోతిమీర  వేసాక చివరగా  తాటి కల్లు పోసి చికెన్ బాగా ఉడకనివ్వాలి.
  • నీరు ఎ మాత్రం వేయకుండా కల్లులోనే  కూరను ఉడకనివ్వాలి.
  • నోరూరించే కల్లుకోడి కూర తినడానికి సిద్దంగా ఉంది.
  • ఈ కళ్ళు కోడి కూరని కట్టెల పొయ్యి మీద వండి తింటే ఆ రుచి చాలా బాగుంటుంది .

 

 

 

Leave a Reply