కల్లు కోడి కూర ఎలా తయారీ చేయాలి
కల్లు కోడి కూర తయారికి కావల్సిన పధార్థాలు :
- చికెన్
- తాటి కల్లు
- ఉల్లిగడ్డలు -2
- పుదినా, కోతిమీర
- అల్లం, వెల్లుల్లి పేస్టు
- కారం
- ఉప్పు
- పసుపు
- నూనె
- ధనియాల పొడి
- గరం మసాలా దినుసులు
కల్లు కోడి కూర తయారీ విధానం :
- శుబ్రంగా కడిగిన చికెన్ తీసుకోని దానిలో పసుపు,కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఒక గంట పాటు పక్కన పెట్టాలి.
- స్టవ్ మీద గిన్నె పెట్టి కూరకి తగినంత నూనె పోసి వేడి అయ్యాక పుదినా, గరం మసాలా దినుసులు, ఉల్లి ముక్కలు వేసి వేగాక కాస్త పసుపు వేసి ఆ తరువాత చికెన్ వేసి వేగనివ్వాలి.
- చికెన్ వేగాక ధనియాల పొడి, కోతిమీర వేసాక చివరగా తాటి కల్లు పోసి చికెన్ బాగా ఉడకనివ్వాలి.
- నీరు ఎ మాత్రం వేయకుండా కల్లులోనే కూరను ఉడకనివ్వాలి.
- నోరూరించే కల్లుకోడి కూర తినడానికి సిద్దంగా ఉంది.
- ఈ కళ్ళు కోడి కూరని కట్టెల పొయ్యి మీద వండి తింటే ఆ రుచి చాలా బాగుంటుంది .