గుత్తి వంకాయ కూర తయారు చేసే విధానం
గుత్తి వంకాయ కూర తయారికి కావలసిన పదార్థాలు :
- వంకాయలు : 250 గ్రా
- ఉల్లిగడ్డలు : 2
- పచ్చిమిర్చి : 5
- పసుపు, కారం, ఉప్పు : తగినంత
- అల్లం వెల్లుల్లి పేస్టు : 2 స్పూన్స్
- కరివేపాకు, కొత్తిమీర
- గసాల : 2 స్పూన్స్
- కాజు : 10
- ధనియాల పొడి : 1 స్పూన్
- గరం మసాలా పొడి : 1 స్పూన్
- నూనె
- చింతపండు రసం : 1/2 కప్పు
గుత్తి వంకాయ కూర తయారు చేయు విధానం :
- వంకాయలను కడిగి మసాలా నింపే విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి.
- మసాలా తయారికి మిక్స్ జార్లో కాజు, గసాల వేసి మిక్స్ చేసాక అదే జార్ లో తరిగిన ఉల్లిగడ్డ, పచ్చ్చిమిర్చి వేసి మిక్స్ చేసి ఈ రెంటిని ఒక బౌల్ లో తీసుకున్నాక వీటిలో అల్లం వెల్లులి పేస్టు, గరం మసాలా పొడి, పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.
- ఇలా తయారు చేసిన మాసాలను కట్ చేసిన వంకయాలలో నింపాలి.
- స్టవ్ ఫై కడాయి పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి వేడి అయ్యాక మసాలా నింపిన వంకాయలను జాగ్రత్తగా వేసి మూత పెట్టాలి. మిగిలిన మాసాలను కూడా అందులోనే వేసి మగ్గనివ్వాలి.
- 5 నిముషాలు మగ్గాక రుచికి సరిపడినంత చింతపండు రసం వేసి కొంచెం కలుపుకోవాలి.
- కరివేపాకు, కొత్తిమీర, ధనియాల పొడి కూడా వేసి మరింత సేపు కూరను మగ్గనివ్వాలి.
- ఈ గుత్తి వంకాయ కూర ఎప్పుడు చిన్న మంట ఫై చేసుకొంటే చాల బాగుంటుంది.