మెంతి టమాట కూర తయారీ విధానం :

రుచులు

మెంతి టమాటా కూర తయారీకి కావలసిన పదార్థాలు :

 1. మెంతి కూర : 250 గ్రా
 2. టమాటో : 250 గ్రా
 3. ఉల్లిగడ్డలు : 2
 4. కరివేపాకు, కొత్తిమీర
 5. పచ్చిమిర్చి : 6
 6. నూనె
 7. ఆవాలు , జీలకర్ర : 1 స్పూన్
 8. పసుపు, ఉప్పు, కారం : తగినంత
 9. అల్లం వెల్లులి పేస్టు : 1 స్పూన్
 10. ధనియాల పొడి : 1 స్పూన్
 11. గరం మసాలా పొడి : 1/2 స్పూన్

తయారీ విధానం :

 • మెంతి కూర ఆకులను ముందుగా కడిగి సన్నగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి.
 • స్టవ్ ఫై గిన్నె పెట్టి 4 స్పూన్స్ నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన ఉల్లిగడ్డలు వేసాక అల్లం వెల్లులి పేస్టు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన మెంతి ఆకులను, పసుపు వేసి వేగనివ్వాలి.
 • 3 నిమిషాల పాటు ఆకుకూరను నూనెలో మగ్గనివ్వాలి .
 • తరువాత సన్నగా తరిగిన టమాటో వేసి బాగా మగ్గనివ్వాలి, అవసరం ఐతే కొన్ని నీళ్ళు పోయాలి.
 • కూరకి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కొత్తిమిర వేసి కలిపి మరింత సేపు మగ్గనివ్వాలి.
 • ఈ మెంతి టమాటో కూరకి టమాటో కొంచెం ఎక్కువగా తీసుకోవాలి ,ఎందుకనగా మెంతి కూర కొంచెం చేదుగా ఉంటుంది .
 • మనకు ఇస్టమ్ ఉంటే  ఒకటి లేదా రెండు బంగాళాదుంప ని కూడా కూరలో వేసుకొని వండుకోవచ్చు.

Leave a Reply