సర్వ పిండి

సర్వ పిండి | గిన్నె పిండి తయారి విధానం

రుచులు

తయారికి కావలసిన పదార్థాలు :

  • బియ్యం పిండి : 1 కప్పు 
  • నువ్వులు : 1/4 కప్పు 
  • పల్లీలు : 1/4 కప్పు 
  • పాలకూర తురుము : 1/2 కప్పు 
  • కారం : 1 స్పూన్ 
  • ఉప్పు :1/2 స్పూన్ 
  • నూనె : 2 స్పూన్ 
  • వాము : 1/2 స్పూన్ 
  • అల్లం వెల్లుల్లి పేస్టు :1 స్పూన్

తయారి చేయు విధానం :

జల్లించిన బియ్యం పిండిలో సన్నగా తురిమిన పాలకూరను, నువ్వులు, వాము, పల్లీలు, కారం, ఉప్పు, అల్లం వెల్లులి పేస్టు వేసాక తగినన్నినీరు పోసి జంతికల పిండిలా తడుపుకోవాలి . ఈ పిండిని  10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి .

వెడల్పాటి గిన్నెలో  నూనె పోసి ఈ పిండిని సన్నగా చేతితో వత్తుకోవాలి, అక్కడక్కడ చిన్న రంధ్రాలు పెట్టుకొని సన్నని మంటలో కాలనివ్వాలి.