పన్నీర్ బట్టర్ మసాలా కూర తయారీ విధానం :

రుచులు

పన్నీర్ బట్టర్ మసాలా కూర తయారీకి కావలసిన పదార్థాలు :

  1. పన్నీర్  : 200 గ్రా
  2. టమాటో రసం : 1 కప్పు
  3. ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు : 1/2 కప్పు
  4. పసుపు , ఉప్పు , కారం : తగినంత
  5. అల్లం వెల్లుల్లి పేస్టు ; 2 స్పూన్
  6. వెన్న : 3 స్పూన్
  7. పాలు : 1 కప్పు
  8. దనియాల పొడి : 2 స్పూన్స్
  9. గరం మసాలా పొడి : 1/2 స్పూన్
  10. కసూరి మేతి : 2 స్పూన్స్
  11. కొత్తిమీర

    తయారు చేయు విధానం :

    • చిన్న గిన్నెలో దనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, కసూరి మేతి పొడి, కొన్ని పాలు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి.
    • స్టవ్ ఫై కడాయి పెట్టి అందులో 1 స్పూన్ వెన్నె వేసి అందులో పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
    • అదే కడాయి లో మరింత వెన్నె వేసి అందులో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు,  ఫ్రై  చేసిన ఉల్లిగడ్డ ముక్కలను వేసి వేగాక టమాటో రసం వేసి 5నిమిషాల తరువాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని వేసి కాసేపటి తరువాత 1/2 కప్పు పాలు నెమ్మదిగా పోస్టు కలుపుకోవాలి.
    • ఇప్పుడు వేయించిన పన్నీర్ ముక్కలను వేసి కలిపాక తగినంత ఉప్పు వేసుకోవాలి.
    • చివరగా కొత్తిమీర చల్లుకోవాలి.

 

Leave a Reply