బెసన్ లడ్డు / సాదా లడ్డు

రుచులు

బెసన్ లడ్డు తయారీకి కావలసిన పదార్థాలు :

  1. శనగపిండి : 1 కప్పు
  2. పంచదార  : 1కప్పు
  3. నెయీ      : 1/4 కప్పు
  4. నూనె       : తగినంత
  5. యాలకుల పొడి : 1/2 స్పూన్
  6. కాజు : 5

తయారు చేయు విధానం :

  • శనగ పిండిని జల్లించి పెట్టుకోంవాలి.
  • పిండిని జంతికల పిండిలా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
  • స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో నూనె పోసి వేడిచేశాక శనగ పిండిని జంతికలుగా ఒత్తుకోవాలి .
  • దోరగా కాక ముందే వాటిని తీసి ఒక గిన్నెలో వేసి చల్లరానివ్వాలి . వీటిని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ లో వేసి పొడి చేసుకొని జల్లించుకోవాలి .
  • స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయీ వేసుకొని కాజు ని వేయించుకోని పక్కన తీసి ఉంచుకోవాలి .
  • అదే కడాయి లో పంచదార వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని తీగ పాకం వెచ్చే వరకు చూసుకోవాలి .
  • ఇప్పుడు పాకంలో శనగ పిండిని వేస్తూ వుండలు కట్టకుండా కలుపుతూ అందులోనే యాలకుల పొడి, కాజు ని వేసి కలుపుకోవాలి.
  • నెయ్యి ని కూడా వేసి బాగా కలియబెట్టాలి .
  • కొంచెం చల్లారాక లడ్డు లు కట్టుకోవాలి .
  • ఈ బెసన్ లడ్డు నెల రోజుల పాటు నిలవ ఉంటుంది .

 

Leave a Reply