నోబెల్ శాంతి బహుమతికి డోనాల్డ్ ట్రంప్ నామినేట్
వాషింగ్టన్, సెప్టెంబర్ 9: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయినట్లు ప్రముఖ మీడియా సంస్థ డైలీ మెయిల్ నివేదించింది. ఇజ్రాయిల్ – యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చడంలో మధ్యవర్తిత్వం వహించినందుకు గానూ ట్రంప్‌ను నామినేట్ అయ్యారు. ప్రపంచ దేశాల మధ్య విభేదాల్ని పరిష్కరించిన ట్రంప్ ను ప్రశంసిస్తూ నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ టైబ్రింగ్-జెడ్డే నామినేట్ చేశారు. ఇంతకు ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా 2009లో అణ్వస్త్రవ్యాప్తి నిరోధానికి కృషి చేస్తూ.. ప్రపంచ శాంతి కోసం పని చేసినందుకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
నోబెల్ బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేసిన సందర్భంగా టైబ్రింగ్-జెడ్డే మాట్లాడుతూ.. దేశాల మధ్య శాంతిని నెలకోల్పేలా ట్రంప్ చేస్తున్న కృషి అమోఘమని ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో పాటు భారత్ – పాక్ కాశ్మీర్ సరిహద్దు వివాదం, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా దేశాల మధ్య వివాదాల్ని పరిష్కరించేందుకు ట్రంప్ కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు.