రియా చక్రవర్తి అరెస్ట్, కోర్టులో హాజరుపరచనున్న అధికారులు
ముంబై సెప్టెంబర్ 8: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన సుశాంత్ తన ఇంట్లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. కాగ ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న నార్కోటిక్స్ పోలీసులు ఇవాళ ముంబైలో రియా చక్రవర్తిని అరెస్టు చేశారు. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద రియాను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అనంతరం డ్రగ్స్ రికవరీ కోసం ఆమెను వివిధ ప్రాంతాలకు ఎన్‌సీబీ తీసుకువెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే నార్కోటిక్స్ పోలీసులు ఈ కేసులో పలువుర్ని అరెస్టు చేశారు. రియా సోదరుడు శౌవిక్‌తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ సామ్యూల్ కూడా ఎన్‌సీబీ ఆధీనంలో ఉన్నారు. డ్రగ్స్ కేసులో గత మూడు రోజుల నుంచి రియాను ఎన్‌సీబీ విచారించింది.
రియా చక్రవర్తి డ్రగ్స్ తీసుకున్నదేమో అన్న కోణంలో ఎన్‌సీబీ అధికారులు ఆమెకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. డ్రగ్స్ పరీక్ష తర్వాత రియాను కస్టడీలోకి తీసుకుని మరింత లోతుగా విచారించనున్నారు. రియాకు డ్రగ్స్‌తో సంభందం ఉన్నట్లు స్వయంగా తన సోదరుడు శౌవిక్ చక్రవర్తి వెల్లడించాడు. ఎన్‌సీబీ సీజ్ చేసిన ఫోన్ల ఆధారంగా.. రియాకు డ్రగ్ కాలర్స్ తో లింకులు ఉన్నట్లు తేలింది.