sushant rhea controversy

సుశాంత్‌-రియాల వివాదస్పదంపై స్పందించిన మంచు ల‌క్ష్మీ, తాప్సి

వినోదం

హైదరాబాద్, ఆగష్టు 31:  నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడి మరణించడంతో…. బాలీవుడ్ లో నేపోటిజంపై పెద్ద దుమారమే చెలరేగింది. సుశాంత్ మరణంపై అతని తండ్రి కే కే సింగ్ నటి రియా చ‌క్ర‌వ‌ర్తినిపై అనుమానం వ్యక్తపరచడంతో ఆమెపై కేసు నమోదు చేసి సీబీఐ రంగంలోకి దిగింది. ఈ నేప‌థ్యంలో రియా మీడియా ముందుకు వ‌చ్చి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేసాయ్ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. తనతో పాటు సుశాంత్ కి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించింది. ఈ ఇంట‌ర్వ్యూ అనంతరం రియాకి సానుభూతిపరులు పెర‌గ‌డంతో పాటు ట్విట్టర్ లో #JusticeForRheaChakraborty అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే ఈ వివాదంపై మంచు ల‌క్ష్మీ స్పందిస్తూ సోష‌ల్ మీడియా ద్వారా #JusticeForSushanthSinghRajput, #JusticeForRheaChakraborty అంటూ రియాకు మద్దతుగా ట్వీట్ చేశారు.‌ రియా చక్రవర్తిని జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేసాయ్ ఇంటర్వ్యూ చేయగా ఆ ఇంటర్వ్యూ మొత్తం చూసిన అనంతరం మంచు లక్ష్మి ఈ విధంగా పేర్కొన్నారు.

నిజమేంటో నాకు తెలియదు, అసలు నిందితులెవరనేది తేలకముందే మీడియా ఒక అమ్మాయి రాక్షసురాలిగా చిత్రీకరిస్తోంది. సుశాంత్ కు న్యాయం జరగాలని అలాగే నిజమేమిటో తెలియకుండా రియాపై నిందమోపడం సరికాదని తనదైన శైలిలో కామెంట్ చేసింది.

మంచు లక్ష్మి ట్వీట్ కు స్పందిస్తూ తాప్సి కూడా రీట్వీట్ చేసింది. ‘తనకు సుశాంత్ సింగ్ అలాగే రియా చక్రవర్తి వ్యక్తిగతంగా పెద్దగా తెలియదని. కాని నేరాన్ని నిరూపించబడని వ్యక్తిని దోషిని చేస్తూ న్యాయవ్యవస్థను అధిగమించడం చాలా తప్పుని పేర్కొంది. న్యాయ వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని. చట్టాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించాలని కోరుకుంటున్నా’ అని తాప్సి తెలిపింది.