హాస్పిటల్ నుండి అమిత్ షా డిశ్చార్జ్
గుర్‌గావ్, ఆగష్టు 31: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవలే కరోనా భారిన పడిన విషయం తెలిసిందే… దీంతో వైద్యుల సూచనల మేరకు ఆయన గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉండాలని అన్నారు. చికిత్స అనంరతం ఒళ్లు నొప్పులు, నీరసం తగ్గకపోవడంతో అనారోగ్య కారణంగా మళ్ళి ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని వైద్య బృందం శనివారం మీడియాకు వెల్లడించింది. దీంతో ఈరోజు ఉదయం 7 గంటలకు ఆయన ఆసుపత్రి నుండి నుంచి డిశ్చార్జీ అయ్యి ఇంటికి చేరుకున్నారు. తరువాత దేశప్రజలను ఉద్దేశించి ఓనం శుభాకాంక్షలు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు.
కాగా గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలకు చెందిన అగ్రనేతలు కరోనా బారినపడుతున్నారు. ఇదేవిధంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ సత్యేందర్ జైన్, ఉత్తర్ ఖండ్ మినిస్టర్ సత్పాల్ మహారాజ్, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో సహా అగ్రనాయకులకు కరోనా పాజిటివ్ వచ్చింది.