Mann Ki Baatshow dislikes

మన్ కీ బాత్ కార్యక్రమంపై నెటిజన్ల మండిపాటు : 2.7 లక్షల డిస్ లైక్స్

జాతీయం

డిల్లీ, ఆగష్టు 31:  ఆదివారం ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం యూట్యూబ్ లోనూ ప్రత్యక్షప్రసారమైంది. అయితే ఈ మన్ కీ బాత్ పై యూట్యూబ్‌లో నెటిజన్స్ ప్రతికూలంగా స్పందించారు. పాజిటివ్ కామెంట్స్ కంటే నెగిటివ్ లైక్‌లు, కామెంట్లు ఎక్కువయ్యాయి. గత ఆరు సంవత్సరాల నుంచి ఇప్పటివరకు నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నడూ లేనంతగా తాజా మన్ కీ బాత్ కార్యక్రమానికి డిస్ లైక్‌లతో హోరెత్తించారు.

మన్ కీ బాత్ లో మోడీజీ స్పీచ్ కి 2.7 లక్షల డిస్ లైక్స్, 30 వేల లైకులు(అంటే పదో వంతు) వచ్చాయి. కామెంట్స్ లో ఒకొక్కరూ ఒక్కోలా దుమ్మెత్తిపోస్తున్నారు. అందులో మచ్చుకు కొన్ని.

“మా జీవితాలతో ఆడుకున్నది చాలలేదనుకుంటాను. ఇంకా కొత్త ఆటలు, కొత్త ఆక్టివిటీస్ ట్రై చేస్తున్నారు”

“ఆర్థిక సంక్షోభం act of god కాదు. అది మీరు చేసిన తప్పుల ఫలితం. COVID-19 మొదలవ్వడానికి ముందు నుండీ GDP పడిపోతూ ఉంది”

“రైతుల పంటలు నాశనం అయ్యాయి. నువ్వు మన్ కీ బాత్ వీడియోలు చేసుకుంటున్నావా?”

“స్టూడెంట్స్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. రెవల్యూషన్ మొదలయ్యింది”

“మన్మోహన్ సింగ్ గారి మీద జోకులు వేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నాను. అతను బాగా చదువుకున్నవాడు ఎకనామిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్😥”

“పదేళ్ల తరువాత ఒక సినిమా వస్తుంది. దాని పేరు worst PM”

“అప్పట్లో భారత్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఉండేది. ఇప్పుడు అడానీ & అంబానీ కంపెనీ పాలనలో ఉంది”

మన్ కీ బాత్ ప్రోగ్రాంపై ప్రజల ప్రతికూల స్పందనకు ఇది అద్దం పడుతోంది. దీనికి కారణం ఏమిటని అటు మీడియాలోను ఇటు సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతోంది.

Leave a Reply