అరిసెలు తయారు చేయడం
అరిసెలు తయారికి కావలసిన పదార్థాలు :
- బియ్యం : 1 కే జి
- బెల్లం :1/3 కే జీ
- నూనే : 1/2 కే జీ
- యాలకులు : 5
- నేయీ : తగినంత
- నువ్వులు :1/4 కప్పు
అరిసెలు తయారు చేయు విధానం :
- బియ్యం ఒక రోజు లేదా 10 గంటల ముందుగా నానబెటుకోవాలి .
- బాగా నానిన బియ్యాన్నికడిగి కొద్దిగా అరపోయాలి. ఆరబోసిన బియ్యాన్నిపిండి పట్టించి తడి ఆరనివ్వకుండా మూత పెట్టాలి.
- బెల్లాని చిన్న ముక్కలుగా చేసి వేడి చేస్తూ ఒకసారి జాలితో ఇసుక , మలినాలు లేకుండా వడపోసుకోవాలి.
- ముదురు పాకం వచ్చాక యాలకుల పొడిని వేసి కలపాలి , తడి పిండిని పాకంలోకలుపుతూ ఉండలు కట్టకుండా కలపాలి .
- ఈ పాకం పిండిలో నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి .
- ఆ పిండిని చిన్న ఉండలుగా చేసుకొని పూరికంటే మందంగా వత్తుకొని,కొంచెం నువ్వులు కలిపి నూనెలో వేసి ఎర్రగా వేగనివ్వాలి .
- అరిసెల చట్ర్రం సహాయంతో నునే బాగా బయటకు వచ్చేంత వరకూ చేసి ఒక పేపర్ మీద ఉంచి చల్లారక డబ్బాలో పెట్టుకోవాలి.
- ఈ అరిసెలు ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి.