టిఆర్ఎస్ ఒక ముదనష్టపు ప్రభుత్వం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 5: టిఆర్ఎస్ ప్రభుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కరోనా మరణాలపై తప్పుడు రిపోర్ట్ లు ఇస్తున్నందుకు గవర్నర్, హైకోర్డు తిట్టినా కేసిఆర్ కు సిగ్గులేదంటు వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. యశోద ఆసుపత్రిలో కేసీఆర్ వాటా ఎంతో చెప్పాలన్నారు. ప్రవేటు ఆసుపత్రుల నుండి సూట్ కేసులు… మంత్రి ఈటెల ఇంటికి వెళ్తున్నాయా..? లేక సీఎం ఇంటికి పోతున్నాయా..? అని ప్రశ్నించారు.
ప్రాజెక్ట్ లల్లో కమీషన్ కోసం దోచుకొన్నది చాలదా కేసీఆర్..? అంటూ మండిపడ్డారు. ఇంత దరిద్రపు ప్రభుత్వాన్ని నేను ఎప్పుడు చూడలేదన్నారు. ఇదో మొదనాష్టపు ప్రభుత్వం తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ ఆసుపత్రి లో తప్పుడు రిపోర్ట్ లు ఇవ్వమని చెప్పింనదుకు హుజురాబాద్ లో ప్రవీణ్ యాదవ్ ఉద్యోగం నుంచి తొలగించారని, దాంతో ఆయన సూసైడ్ చేసుకున్నాడని అన్నారు. ప్రవీణ్ యాదవ్ ను ఈటల రాజేందర్, ఆసుపత్రి సూపర్డేండెంట్ లే చంపించారని ఆరోపించారు.
ఈటల రాజేందర్ పై DGP కేసులు పెట్టాలన్నారు. నియోజకవర్గం హుజురాబాద్ లో ని ప్రభుత్వ ఆసుపత్రిలో సగం సిబ్బంది కూడా లేరని, ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసారని తెలిపారు.
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడతాం అన్నావ్ ఏమైందంటూ మంత్రి ఈటెలను ప్రశ్నించారు. కాంట్రాక్టర్ వద్ద కమీషన్ లకు కక్కుర్తి పడకుండా ప్రజల సంక్షేమం కోసం పని చేయాలంటూ హితవు పలికారు.