7వ తారీఖు నుండి హైద్రాబాద్ మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబర్ 5: హైదరాబాద్ లో మెట్రో సేవలు 7 వ తేది నుండి ప్రారంభం కానున్నాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దశల వారీగా మెట్రో సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
మొదట ఎల్బీ నగర్ నుండి మియాపూర్ రూట్ ను 7 న స్టార్ట్ చేయనున్నారు. 8వ తేదీన నాగోల్ – రాయదుర్గు కారిడార్ లో మెట్రో సేవలు మొదలు కానున్నాయి. అయితే ఉదయం 7 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. 9వ తేదీ నుండి అన్ని కారిడార్లలో మెట్రో నడవనుంది. దాదాపు పది నుండి పదిహేను వేల మంది ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా మెట్రో స్టేషన్స్ లో థర్మల్ స్రీనింగ్ , శానిటైజర్, సోషల్ డిస్టెంసింగ్ కోసం మార్కింగ్ ఏర్పాట్లు చేశామన్నారు. ఫెస్ మాస్క్ ఉంటేనే మెట్రో లో కి అనుమతి ఉంటుందని, మాస్క్ లేనివారికి మస్క్ లు కూడా కొనుక్కునే వెసులుబాటు ఇస్తున్నామని తెలిపారు. స్మార్ట్ కార్డు , క్యూ ఆర్ ,టికెట్స్ ను మాత్రమే వాడాలని మెట్రో ఎండీ సూచించారు.