పవన్ కల్యాణ్ 28వ సినిమాపై క్లారిటీ ఇచ్చిన మైత్రి మూవీస్
హైదరాబాద్, సెప్టెంబర్ 2: నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను ఆయా చిత్ర నిర్మాణ సంస్థలు పవన్ అభిమానులతో పంచుకున్నాయి.
ఇప్పటికే వకీల్ సాబ్’ సినిమా మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ఈ పోస్టర్ విడుదలైంది.కాగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర బ్యానర్స్ క్రియేషన్స్‌పై దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్నారు. ఇది బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ హిట్ ‘పింక్’ తెలుగు రీమేక్ అన్న విషయం తెలిసిందే. తరువాత దర్శకుడు క్రిష్‌తో పవన్ చేయనున్న పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ ఫస్ట్ లుక్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.మొదట ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ టైటిల్ ను ఫిక్స్ అయ్యారు. కాని ఈ సినిమాకు మాస్ అప్పీల్ లేదనే ఉద్దేశ్యంతో ’గజ దొంగ’తో పాటు ‘బందిపోటు’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు.
క్రిష్ సినిమా తరువాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ తన 28వ చిత్రాన్ని చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ను హరీశ్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు.