
అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబుగారిలో మార్పు రాలేదు
విశాఖపట్నం, సెప్టెంబర్ 5: ఏపీ ప్రతిపక్షనేత, తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘అధికారం కోల్పోయి ఏడాది దాటినా చంద్రబాబులో మార్పు రాలేదు. అప్పట్లో తహసీల్దార్ వనజాక్షిపై అమానుషంగా దాడిచేసిన చింతమనేని ప్రభాకర్‌ను వెనకేసుకొచ్చాడు. ఇప్పుడు రూ.150 కోట్ల ఈఎస్ఐ స్కామ్ సూత్రధారి అచ్చెన్నాయుడు, హంతకుడు కొల్లు రవీంద్రకు ధైర్యం చెబుతున్నాడు’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, అతను ముందు చేసిన ట్వీట్ లో ‘చంద్రబాబు అధికారంలో ఉండగా విశాఖను విచ్ఛిన్నం చేశారని’ విజయసాయిరెడ్డి ఆరోపించారు. “విశాఖకు బీచ్ తెచ్చానని చెప్పుకుంటాడు. సబ్ మేరిన్ కూడా తన ఘనతేనని తన వారితో చెప్పించుకుంటాడు. అలాంటి వ్యక్తి విశాఖ జిల్లాలో నిర్వాసితులకు తన 14ఏళ్ల పాలనలో కనీసం పరిహారం ఇవ్వలేదు. పేదలను పరిహసించాడు. జిల్లా నుంచి వచ్చిన ఆదాయంలో నాలుగోవంతు కూడా తిరిగి ఇక్కడ ఖర్చు చేయలేదు. జిల్లాలో మత్స్యకారులు, కాపులతో ఆటలాడుకున్నాడు. కుటీర పరిశ్రమలను కాలదన్ని… కార్పొరేట్ రంగానికి కొమ్ముకాస్తూ… పేదల పొట్టకొట్టాడు. ఆంధ్రా యూనివర్సిటీలో తన 14 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క టీచింగ్ అసిస్టెంట్ పోస్టును కూడా భర్తీ చేయలేదు” అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
– విశాఖ పట్నం నుంచి వచ్చిన ఆదాయంలో 1/4 వంతు కూడా తిరిగి ఈ నగరంపై ఖర్చు చేయలేదు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాలనలో అదే తంతు. విశాఖ నగర ఆదాయాన్ని వేరో చోట్లకు మళ్లించాడు బాబు.
– కేవలం తనవాళ్లు లేరన్న ఉద్దేశంతో విశాఖకు కేంద్రం ఇచ్చిన మెట్రో రైలును సైతం వేరే ప్రాంతానికి మళ్లించాలనుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నగరం కావడంతో విశాఖకు మెట్రో రైలును కేంద్రం ఇచ్చింది. అంటే తాను చేయకపోగా కేంద్రం చేయాలనుకున్న అభివృద్ధిని సైతం సైంధవునిలా అడ్డుకుంటున్నాడు చంద్రబాబు.
-ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ విమ్స్ , ఇతర మెడికల్ కాలేజ్ లు పెట్టేవరకు కేజీహెచ్ తప్ప వేరే పెద్దాసుపత్రే లేదు. కేజీహెచ్ లో ఒక మూల ముగ్గుతున్న ఆంధ్రా మెడికల్ కాలేజ్ కి తన 14 ఏళ్ల పాలనలో ఎలాంటి వసతులూ కల్పించలేదు చంద్రబాబు నాయుడు.
– విశాఖలో విద్యాభివృద్ధికోసం చంద్రబాబు చేసింది శూన్యం. ఉన్న స్కూల్స్, కాలేజీలు ఎత్తేశాడు. ఆంధ్రా యూనివర్సిటీని భ్రష్టుపట్టించాడు. యూనివర్సిటీ భూములను సైతం తన అనుయాయులకు దానం చేశారు.
– తన 14 ఏళ్ల పాలనలో ఆంధ్రా యూనివర్సిటీలో ఒక్క పర్మినెట్ పోస్టునూ భర్తీ చేయలేదు. వేకెన్సీలున్నా… టీచింగ్ ఫ్యాకల్టీని నియమించే పనిచేయలేదు.
– నీచమైన రాజకీయం చేయడంలో చంద్రబాబుకు సాటిలేరెవ్వరూ… కేఏ పాల్ ను అడ్డంపెట్టుకుని… రాష్ట్రంలో వైసీపీని దెబ్బకొట్టాలనుకున్నాడు… విశాఖ జిల్లాలో క్రిస్టియన్ ఓట్లకోసం కేఏ పాల్ సాయంతో ప్రజలను విడగొట్టాలనుకున్నాడు. విజ్ఞులైన ఉత్తరాంధ్ర ఓటర్లు… ఆ ఆటలను సాగనీయలేదు.
– విశాఖ జిల్లాలోగానీ ఉత్తరాంధ్రలోగానీ బలమైన సామాజిక వర్గమైన కాపులను అణగదొక్కాడు చంద్రబాబు నాయుడు.
– మత్స్యకారుణ్ణి విశాఖపట్నం మేయర్ చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతుంది. విశాఖలో విధ్వంసం సృష్టించి మత్సకారుల పొట్టకొట్టిన ఘనత చంద్రబాబుది.
– ఖండాంతర ఖ్యాతిగాంచిన విశాఖ జిల్లాలోని ఏటి కొప్పాకలో బొమ్మల తయారీ పరిశ్రమను నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు. తన పాలనలో కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తూ … కుటీర పరిశ్రమను ఎంత నాశనం చేయాలో అంత చేశాడు.
– విశాఖకు బీచ్ తెచ్చా, సబ్ మేరిన్ తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు… NOBC (నేవల్ ఆల్టర్నేటివ్ ఆపరేషనల్ బేస్ ) నిర్వాసితులకు కనీసం పరిహారం ఇవ్వలేదు.